TEJA NEWS

పిడుగుపాటుకు గొర్రెల మృతి

_ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ
వనపర్తి నియోజకవర్గంలోని
గోపాల్పేట మండలం లక్ష్మీదేవిపల్లి, చాకలి పల్లి గ్రామాలలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షం కురిసింది.

ఈ క్రమంలో పడ్డ పిడుగుపాటుకు లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన విశ్వనాథం, చాకలిపల్లి గ్రామం బోయ రాములు కు చెందిన 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి

విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వెంటనే జిల్లా పశుసంవర్ధ క శాఖ అధికారితో, మండల తాసిల్దార్ తో మాట్లాడారు.
సంఘటన స్థలాన్ని సందర్శించి నష్టపోయిన ఆ గొర్రెల కాపరుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

అకాల వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతన్నలు ఎలాంటి ఆవేదన చెందరాధన్నారు

తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని మ్మెల్యే పేర్కొన్నారు