TEJA NEWS

భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత

భూపాలపల్లి జిల్లా:
భూపాలపల్లి జిల్లా కాటారం బస్ స్టాప్ వద్ద సమయానికి బస్సులు రాక ఎప్పుడు చూసినా నాలుగైదు బస్సులకు సరిపడా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు.

కాటారం మండలంలో బస్టాండ్ లేక వృద్ధులు వికలాంగులు,మహిళలు కూర్చోవడానికి సౌకర్యం లేక రోడ్డుపైనే గంటలు తరబడి బస్సుల కోసం వేచి ఉండడం దయానీయ పరిస్థితి నెలకుంది.

సాయంత్రం నాలుగు గంటల నుండి వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణి కుతో రద్దీ ఎక్కువ పెరుగు తుంది, భూపాలపల్లి డిపోకు చెందిన 7333, 4171, గోదావరిఖని డిపోకు చెందిన 7041 ,9288, మంథని డిపోకు చెందిన1522,బస్సులు ఒకే సమయంలో ఒకేసారి ఐదు బస్సులు వెళ్ళటంతో ఓవైపు విద్యార్థులు మరోవైపు పురుష,మహిళ ఉద్యోగులు,తీవ్ర అవస్థలు పడుతున్నారు.

గోదావరిఖని నుండి భూపాలపల్లికి ఐదు డిపోలకు చెందిన బస్సులు నిత్యం తిరుగుతున్న బస్సుల్లో రద్దీ ఎక్కువ ఉండడంతో గోదావరిఖని నుండి కాటారం మండలం లో నిత్యం విధులు నిర్వహించే మహిళా, ఉద్యోగులు కాటారం లో సమయానికి బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో గంటల కొద్దీ ప్రయాణికులు వేచి ఉండాల్సివస్తుంది,

రోజురోజుకు జనాభా పెరుగుతుండగా బస్సుల సంఖ్య మాత్రం తగ్గిపో తోంది, సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో కాటారం మండల కేంద్రం నుండి గోదావరిఖని వరకు రెండు బస్సులను నడపాలని, ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.


TEJA NEWS