TEJA NEWS

శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన దుండగులను శిక్షించాలి : ఆశ్రమ అధ్యక్షులు ఉయ్యాల లచ్చయ్య.
సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామ రెవిన్యూ శివారు సర్వే నెం.361 లోని 20 గుంటల భూమిలో 1982లో శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని నిర్మించారు. అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు ఆ ఆశ్రమాన్ని కూల్చివేశారు. గత 40 సంవత్సరాల క్రితం స్వామిజీ ఆ గ్రామంలో నివసించి ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలు, ధర్మ సందేహాలు తీర్చేవారు. ఆయన అనంతరం కూడా ఈ ఆశ్రమములో శ్రీ రామానంద స్వామి ఆశ్రమ ట్రస్టు సభ్యులు, స్వామీజి భక్త బృందం గత 24 సంవత్సరాలుగా నిరాటంకంగా శ్రీ రామానంద స్వామి ఆశ్రమములో గీతా పారయణములు, లలిత సహస్రనామాలు, హనుమాన్ చాలీసా మొదలగు పారాయణాలు, భజనలు, భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక భోధనలు, సాంప్రదాయ వేడుకలతో పాటు ప్రతి హిందూ పండుగ పర్వదినములలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆశ్రమ అధ్యక్షులు ఉయ్యాల లక్ష్మయ్య తెలిపారు. ఈ ఆశ్రమానికి సంబంధించిన 20 గంటల భూమిని 1982 వ సంవత్సరంలో గుండా జగన్నాథం అనే యండ్లపల్లి గ్రామస్తుడు ఆశ్రమాన్ని నిర్మించడానికి 20 గుంటల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇద్దరు భార్యలు రెండవ భార్య కూతురు గుండా అనంతలక్ష్మి, గుండా సోమేష్ లు ఆ 20 గుండల భూమా మా నాన్నగారికి చెందిన ఆస్తి అంటూ మా భూమి మాకు కావాలని ఆ స్థలంలో నిర్మించిన ఆశ్రమంలోని ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు తెలిపారు. 2019 డిసెంబర్ 25 న గుండా అనంతలక్ష్మి ప్రోత్బలంతో పంతంగి కృష్ణయ్య, పంతగి మాల్సూర్, పంతంగి సాయి కుమార్,పంతంగి సత్యనారాయణ, ఉయ్యాల ఆది నారాయణ అనే వ్యక్తులు ఆశ్రమంలో నిర్మించిన మండపాన్ని అందులో ఉన్న సీత, రామ, లక్ష్మణ ,హనుమంతుల విగ్రహాలను ధ్వంసం చేశారు. వారిపై ట్రస్ట్ సభ్యులు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదుచేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల సమక్షంలో దేవాలయానికి మావల్ల ఎటువంటి హానీ కలగదని నమ్మబలికిన ఆ వ్యక్తులు మరల ఈనెల 15న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆశ్రమంలోని ఆలయాన్ని అట్టి దుండగులు జెసిబి సహాయంతో కూల్చివేశారు. ఇదే విషయమై గ్రామస్తులు జూన్ 16వ తేదిన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో దేవాలయాన్ని కూల్చివేసిన వ్యక్తులపై పిర్యాదు చేశారు. సూర్యాపేట యస్ఐ బాలు నాయక్ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. జులై 2వ తేది మధ్యానం ఆశ్రమం ఆనవాళ్ళు లేకుండా అట్టి గుండగులు భూస్థాపితం చేశారు. అదే రోజు జెసిబి ని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఆశ్రమం కోసం గుండా జగన్నాథం విరాళంగా ఇచ్చిన 20 గంటల భూమిలో నూతన దేవాలయ శంకుస్థాపన జరుగుతుండగా భూమిని మాకు అమ్మారంటూ దేవాలయం నిర్మించడానికి వీలు లేదంటూ కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు పోలిసుల ప్రమేయం తో గొడవ సర్ధుమరిగి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో శ్రీ రామానంద స్వామి ఆశ్రమ అధ్యక్షులు ఉయ్యాల లచ్చయ, ఉపాధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్ నాయుడు, గౌరవ అధ్యక్షులు కుంట్ల భిక్షం రెడ్డి, రాష్ట్రీయ వానరసేన సభ్యులు మహేశ్వరం రవి చంద్ర, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాకార్యదర్శి బైరు విజయకృష్ణ , రామభక్తులు, యండ్లపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన దుండగులను శిక్షించాలి

TEJA NEWS