TEJA NEWS

శ్రీ స్టార్ యునిసెక్స్” సెలూన్ ను ప్రారంభించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

132- జీడిమెట్ల డివిజన్ నందు వెంకటేష్ నాయి ఆధ్వర్యంలో “శ్రీ స్టార్ యునిసెక్స్ సెలూన్” ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ నేటి రోజులలో కేశాలంకరణకు ఎంతో ప్రాముఖ్యత పెరిగిందని వినియోగదారులకు అన్ని రకాల సేవలను అందిస్తూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, బలరాం, జ్ఞానేశ్వర్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, కాలే గణేష్, నదీమ్ రాయ్, విజయ్ హరీష్, పులి మహేష్, వెంకటేష్ నాయి, విఎస్ఆర్ వెంకటేష్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS