ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ కే చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు