కులవృత్తులను ప్రోత్సహిస్తా కుమ్మరులు ఆత్మగౌరవంగా బ్రతికెలా వారి ఆర్థిక సామాజిక అభవృద్దికి కృషి చేస్తానని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ఆధ్వర్యంలో గీసుగొండ మండలం కొనాయమాకుల రైతు వేదిక లో ఆదివారం పరకాల నియోజకవర్గ కుమ్మరుల నూతన సవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కులవృత్తుల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. పరకాల నియోజకవర్గంలో కులవృత్తులను తాను ప్రోత్సహిస్తానని కుమ్మరులు ఆత్మగౌరవంగా బ్రతికెలా వారి ఆర్థిక సామాజిక అభివృద్దికి కృషి మేడం తో పాటు వారికి నిరంతరం అండగా ఉంటానని ఆయన అన్నారు.