అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11 మంది గాయపడ్డారు.. ఐకియా నుంచి రాయదుర్గం ఠానా సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు వరస రోడ్డు ప్రమాదాలు చేసుకుంటూ వెళ్ళాడు.
నిజాంపేట్ ప్రగతినగర్ కి చెందిన పాతర్ల క్రాంతి కుమార్ ఆదివారం రాత్రి మద్యం తాగి మత్తులో ఐకియా దగ్గర ఆగి ఉన్న కారును ఢీకొట్టగా కారు ధ్వంసం అయింది దాంట్లో ఉన్న మహిళ స్వల్పంగా గాయపడ్డారు.. కారు ఆపకుండా పారిపోతుండగా గచ్చిబౌలి బాబుఖాన్ లైన్ దగ్గర మరో బైక్ ని ఢీకొట్టడు, బైక్ నడిపిస్తున్న వ్యక్తి కాళ్లు విరిగిపోయింది, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.. పిస్తా హౌస్ దగ్గర మరో ఆక్సిడెంట్ చేయగా అక్కడున్న వ్యక్తికి ఏ గాయాలు కాకపోవడంతో అతను వెళ్ళిపోయాడు.. వరుసగా ఒకటి తర్వాత ఒకటి రోడ్డు ప్రమాదాలు చేసుకుంటూ ఒకరు చనిపోయిన కార్ ఆపకుండా వరుస ప్రమాదాలకు కారణం అవుతున్నాడు అని స్థానికులు గుర్తించి నిందితుడి కారు ఆపి దేహశుద్ధి చేసి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.. నిందితుడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 550 రీడింగ్ వొచ్చింది..
తదుపరి విచారణ కోసం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.