ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై సమీక్షించిన స్మార్ట్ సిటీ అధికారులు
తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షించారు. vస్మార్ట్ సిటీ అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధ్యక్షతన జరిగింది. ఆన్లైన్ ద్వారా స్మార్ట్ సిటీ చైర్మన్, కలెక్టర్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వర్, డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డాక్టర్ రమాశ్రీ, పాల్గొనగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ డైరెక్టర్ రామచంద్ర రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, ఎగ్జామినర్ అఫ్ అకౌంట్స్ రామచంద్ర రెడ్డి, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏఈకామ్ ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు లో జరుగుతున్న జాప్యంపై చర్చించి, కారణాలు తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో సిసి కెమెరా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించగా త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే అన్యువల్ బడ్జెట్ పై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు.