డాక్టర్ హత్యకు నిరసనగా స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల ర్యాలీ.
— కొవ్వొత్తులతో డాక్టర్ మోమితకు ఘన నివాళి.
బ్యాడ్ టచ్, గుడ్ టచ్ లపై అవగాహన కల్పించాలి… చింతనిప్పు కృష్ణచైతన్య.
………………………………………………………………….
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
పశ్చిమ బెంగాల్లో పీజీ మెడిసిన్ విద్యార్థి డాక్టర్ మోమితాను అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా శనివారం స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు నగరవీధులలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని , డాక్టర్ల వృత్తి గౌరవం పెంచాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని , జస్టిస్ ఫర్ మోమిత నినాదాలతో ఉన్న ఫ్లకార్డులు చేత పట్టుకొని పాఠశాల చిన్నారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ లపై అవగాహన పెంచాలని ప్రత్యేక ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. పాఠశాల మెయిన్ గేట్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ నగరంలోని పలు ప్రాంతాల ద్వారా నిర్వహించి తిరిగి పాఠశాలకు చేరుకుంది. తొలుత హత్యాకాండ కు గురైన డాక్టర్ మోమిత చిత్రపటం వద్ద పాఠశాల చిన్నారులు కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మోమితపై జరిగిన హత్యాకాండ హేయమైన చర్య అని పేర్కొన్నారు. డాక్టర్లకు సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ లపై అవగాహన ప్రతినిత్యం కల్పించాలని కోరారు. అమ్మాయిలు ,అబ్బాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై ప్రత్యేకంగా వివరించాలని తెలియజేశారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని సామాజిక అంశాలపై అవగాహన పెంచేలా , నైతిక విలువలు పెంపొందేలా కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.