TEJA NEWS

నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇదివరకే రాష్ట్రం నుంచి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు విషయం వెళ్లగా ఆ భూములలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ భూములకు సంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తనకు వచ్చిన నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందించారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసిన ఆమె.. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చానంటూనే ఓ కీలక సందేహాన్ని లేవనెత్తారు. ఇది మరో వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది.

పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ విషయంపై క్లారిటీ అడిగారు. తాను షేర్ చేసిన పోస్టుకుగానూ నోటీసులు ఇచ్చారు ఓకే. అయితే తాను షేర్ చేసిన పోస్టును సోషల్ మీడియాలో 2 వేల మంది వరకు రీషేర్ చేశారు. వారందరిపై సైతం ఇదే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా స్మితా సబర్వాల్ సూటిగా అడిగారు.

ఒకవేళ వారిపై అలాంటి చర్యలు లేవంటే.. తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరూ అతీతులు కాదనేది ఇక్కడ వర్తించడం లేదని స్పష్టమవుతోందని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.