TEJA NEWS

సికింద్రాబాద్, : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పేద ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా అడ్డగుట్ట, లాలాపేట ప్రాంతాల్లో రెండు 30 పడకల అధునాతన హంగుల ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం పనులను త్వరలో ప్రారంభించానున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ మేరకు తాజాగా అధికారికంగా అన్ని అనుమతులను సాధించామని, త్వరలో పనులను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ తో జిల్లా విద్య అధికారి డాక్టర్ రాజేంద్రనాద్ నేతృత్వంలోని అధికారుల బృందం సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అడ్డగుట్ట లోని ప్రస్తుత ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేసి, దానిని కూల్చివేసిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. నిజానికి గత ప్రభుత్వ హయంలోనే రాష్ట్ర వైద్య శాఖ ద్వారా జీ ఓ నెంబరు 450 తేది: 10 th ఆగష్టు 2023 ద్వారా రూ.13.05 కోట్ల మేరకు నిధుల ఖర్చుతో అడ్డగుట్ట ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి తాము అనుమతిని సాధించామని, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ పుర్తయినందున, వెంటనే బిల్డింగ్ ఖాళీ చేసి తాత్కాలికంగా ఇతర భవనంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవాలని వైద్యులకు సూచించామని తెలిపారు. పాత భవనం కుల్చివేసిన వెంటనే కొత్త ఆసుపత్రి నిర్మాణ పనులు వీలైనంత తొందరగా మేము ప్రారంభించాలని సూచించారు.

తద్వారా అడ్డగుట్ట ప్రజల చిరకాల స్వప్నాని నేరవేర్చమని తెలిపారు. అదే విధంగా లాలాపేట లో అర్బన్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ ప్రాంగణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసి, జీ ఓ నెంబరు 449 తేదీ : 10 ఆగష్టు 2023 ద్వారా రూ.13.05 కోట్ల మేరకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. దీని టెండర్ ల ఖరారు ప్రక్రియ పూర్తయ్యిందని, ఈ పనులు కూడా వీలైనంత తొందరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సితాఫలమండీ లోని కుట్టి వెల్లోడి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయని, 70 పడకల సామర్ధ్యంతో రూ.12 కోట్ల ఖర్చుతో ఈ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అడ్డగుట్ట, లాలాపేట వైద్యాధికారులు పాల్గొన్నారు.