
జిల్లాలోడీజే నిషేధంపై యజమానులకు అవగాహన నిర్వహించిన ఎస్పీ రావుల గిరీధర్
నిషేధఉతర్యులను అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా ఎస్పీ వెల్లడి
వనపర్తి
జిల్లా ప్రజలు డిజె సౌండ్ సిస్టమ్ సాంప్రదాయానికి స్వస్తి పలకాలని
చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ శబ్దాలతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామని డీజే సౌండ్ యజమానులకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ * అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ… అధిక శబ్ద తీవ్రత గల డిజె సౌండ్ సిస్టమ్ ను పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ర్యాలీలో ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అందరికీ తెలుసనీ ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు ఈ డీజే సంపదాయానికి అలవాటు పడి తప్పతాగి విచ్చలవిడిగా చిందులు వేయడం ఒక ఫ్యాషన్ గా మారిందని సాంప్రదాయ బద్దంగా జరగాల్సిన పెళ్ళిళ్ళు శుభకార్యాలలో కూడా డీజే lసౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారిందని డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై వనపర్తి జిల్లా పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్ మరియు బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే (BNS ) 223, 280, 292, 293, 324, BNSS 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
ఈ నిషేదిత ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు..
ఈ కార్యక్రమంలో వనపర్తి అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ, కృష్ణ, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు .
