TEJA NEWS

విజయాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

సూర్యపేట : జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో పురస్కరించుకోని ఆలయ ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.ఉదయం ఆరాధన అభిషేకం అలంకరణ అష్టోత్తర శతనామావళి తదుపరి భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లే శ్రీ విజయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఇష్టకామ్యార్థ సిద్దికై కంకణ ధారణ చేసి 11 రోజులు పాటు ఉదయం 11 ప్రదక్షిణలు చొప్పున ఏకభుక్తిగా చేసినట్లయితే సత్వరమే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి. కోరిన కోర్కెలలో విజయ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఇక్కడ స్వామివారిని విజయాంజనేయ స్వామి వారిగా కొలుస్తారు.సూర్యాపేటలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ విజయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి మంగళవారం మరియు విశేష పర్వదిన సందర్భాలలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెలిపారు.ప్రతి సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భజన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు మండల రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవల్లి దశరథ, కోశాధికారి ఎలమద్ది అశోక్ కుమార్, సభ్యులు జానయ్య మహిళా భక్తులు గీత బాలనాగమ్మ స్వప్న అజిత మంజుల పద్మ తదితరులు భక్తులు పాల్గొన్నారు.


TEJA NEWS