TEJA NEWS

ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్ సైట్,టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

హైదరాబాద్:
ఇందిరమ్మ ఇళ్లపై తెలం గాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నా హాలు జరుగుతున్నాయని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారంటీలకు దరఖాస్తులను స్వీకరించ గా.. వాటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభిం చారు.

ఇక అధికారికంగా ఇంది రమ్మ ఇళ్ల పథకం ప్రారంభ మైనా విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. దీనిపై సమీక్షించిన మంత్రి.. ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్ లో నమోదు చేసినట్టు చెప్పారు.

త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేకంగా వెబ్ సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దీని కోసం జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక డైరెక్టర్లను నియమించినట్టు తెలిపారు.

జనవరి మొదటి వారంలో అంటే జనవరి 7వ తేదీ లోపే 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుం దని.. లబ్దిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతోంద న్నారు.నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి.

గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.


TEJA NEWS