
శ్రీ శ్రీ శ్రీ అగర వినాయగర్ స్వామివారి 12వ సంవత్సరం మహా కుంభాబిషేక మహోత్సవంలో పాల్గొన్న””
రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా
మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా నగరి పట్టణం పుదుపేట ప్రసిద్ధి క్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ అగర వినాయగర్ స్వామివారి 12వ సంవత్సరం మహా కుంభాబిషేక ఆలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధారణ రజిత అష్టబంధన మహోత్త్సవం సందర్భంగా నాల్గవ రోజు ఆలయంలో జరిగిన విశేష పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆలయంలో అనుష్ఠానంలు, క్షీరతర్పణలు
మరియు చతుర్విధహోమం కార్యక్రమాలలో పాల్గొన్నారు.
మంత్రి కి ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణ కుంభ స్వాగతం పలికి, స్వామివారి దర్శనానంతరం ప్రసాదాలతో ఆలయ వేద పండితులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, మున్సిపాలిటీ పార్టీ ప్రెసిడెంట్, జిల్లా వైస్ ప్రెసిడెంట్, చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ సెక్రటరీలు, నియోజకవర్గ అనుబంద విభాగ ప్రెసిడెంట్లు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
