TEJA NEWS

వైభవంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం

సింహాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తపేటలో బుధవారం వైభవంగా ప్రారంభమైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాద్రి అప్పన్న చందన మహోత్సవంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించి అప్పన్న స్వామి ఆశీస్సులు అందుకున్నారు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పోలవరపు దుర్గారావు దంపతులు బుధవారం ఉదయం తొలి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
గత 22 ఏళ్ళుగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాద్రి అప్పన్న చందనోత్సవాలను సింహాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ బీజేపీ సీనియర్ నాయకులు పోలవరపు దుర్గారావు తెలిపారు.
బుధవారం ప్రారంభమైన ఈ చందనోత్సవం 15 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని ఈనెల 30వ తేదీన నిజరూప దర్శనం మరియు స్వామి వారి ఊరేగింపుతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో పోలవరపు బ్రదర్స్ రాజు, సత్తి పాల్గొన్నారు.