
కల్వకుర్తిలో ఏసీ రోడ్ల పనులు ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరైన సిసి రోడ్డు పనులను కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డిలు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో కల్వకుర్తి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాలల శ్రీనివాస్ రెడ్డి,, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడుముల చంద్రకాంత్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జమ్మల శ్రీకాంత్, నాయకులు పాండురంగారెడ్డి, ఆంజనేయులు శ్రీకాంత్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
