TEJA NEWS

విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

చిలకలూరిపేట టౌన్:
విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి భారత చట్టాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జెసి లా కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. పలనాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని గాంధీ పేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో త్రిపురం సురేంద్ర ప్రసాద్, కే పుల్లారావు, పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గృహహింస, ర్యాగింగ్, యూటీజింగ్, సైబర్ క్రైమ్, మహిళల అక్రమ రవాణా, ప్రభుత్వం నుంచి పౌరులు పొందేటువంటి సేవలు హక్కులు తదితరాంశాలపై మాట్లాడడం జరిగినది. విద్యార్థులు ఈ వయసులో చట్టాల పట్ల అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎదురయ్య ఎటువంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చునని వారన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ పలనాడు జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, మెగావత్ సాయి నాయక్, జెసి లా కళాశాల విద్యార్థులు సయ్యద్ షుక్రియ, లహరి, సింధు, శ్రావణి, శైలేష్, లావణ్య, హారిక , ఏఐఎస్ఎఫ్ నాయకులు గోపి, మనోహర్,


TEJA NEWS