TEJA NEWS

గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్..

విధులకు రాకుండా హాజరైనట్టు సంతకాలు చేసినందుకే..

గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సస్పెండ్ చేశారు. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్టుగా. రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఇందిరాదేవి విదులకు హాజరుకాకుండానే రిజిస్టర్లో సంతకం చేస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా డీఎస్ఏచ్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది జనవరి-మార్చిలో పలు విడతల్లో 22 రోజుల పాటు ఆమె విధులకు హాజరు కాలేదని తేలింది. ఆయా రోజుల్లో ఇందిరాదేవి సంతకాలతో పాటు ముఖ ఆధారిత విధానం (ఎస్ఆర్ఎస్) ద్వారా కూడా హాజరు నమోదు చేసినట్లు గుర్తించారు. ఎస్ఆర్ఎస్ ద్వారా ఆయా రోజుల్లో సూపరింటెండెంట్

మచిలీపట్నంలో ఒకరోజు, destiet 8 charen, విశాఖపట్నంలో 10 రోజులున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇందిరాదేవి.. రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు ఇచ్చిన రాతపూర్వక వివరణ సమంజసంగా లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలిచ్చారు. హాజరు పర్యవేక్షణలో అలసత్వం వహించిన అప్పటి డీసీహెచ్ఎస్, నామమాత్రంగా విచారణ చేపట్టిన అప్పటి జిల్లా డీఎం అండ్ హెచ్ వోపై కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు..