Spread the love

సికింద్రాబాద్ :
పేదల వైద్య సేవలకు సహకారం : పద్మారావు గౌడ్
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా కు చెందిన బాలామణి, మంజుల వైద్య సహాయానికి రూ.3.50 లక్షల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధుల మంజూరు పత్రాలను (ఎల్.ఓ.సీ)లను పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని తమ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు. బీ.ఆర్.ఎస్. నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.