నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వాణి ఐటిఐ కళాశాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం
ఉమ్మడి ఖమ్మం
నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో, వాణి ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్
డి. స్వాతి మరియు డాక్టర్ డి.కిరణ్ కుమార్ సహకారంతో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థులు మరియు ఇతరులు 16 రోజుల పాటు జరిగిన ఈ యొక్క కార్యక్రమం లో భాగంగా ర్యాలీ మరియు, ప్లెడ్జ్ టేకింగ్, పరిశుభ్రత పై జనాలలో అవగాహన వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువతకు నెహ్రూ యువ కేంద్ర తరపున మై భారత్ లోగో కలిగిన క్యాప్, పెన్,డైరీ అందించడం జరిగింది.