TEJA NEWS

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఠాగూర్ బాలాజీ సింగ్

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డి తండ్రి బుచ్చి రెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ వారి నివాసానికి చేరుకొని స్వర్గస్థ బుచ్చి రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం అందించారు.