TEJA NEWS

జగిత్యాల జిల్లా మార్చి 06
జగిత్యాల జిల్లా ఎండపల్లి తహశీల్దారు కార్యాలయా నికి భవన యజమాని ఈరోజు తాళం వేశారు.

అద్దె బకాయిలు చెల్లించ లేదని యజమాని భూమేష్ ఆఫీస్‌కు తాళం వేశారు. కార్యాలయం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు 3లక్షల 50వేలు చెల్లించ లేదని తెలిపారు.

కనీసం కార్యాలయ సామాగ్రి సమకూర్చిన ఎండపల్లి సర్పంచ్‌కు కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం నుండి అద్దె బకాయిలు మొత్తం చెల్లించేలా కృషి చేస్తానని ఎండపల్లికి చెందిన ఎంపీటీసీ హామీ ఇవ్వడంతో కార్యాలయం తాళాలను భూమేష్ ఇచ్చారు.


TEJA NEWS