
బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్. మేళా ను సద్వినియోగం చేసుకోండి.
కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 20 వరకు నిర్వహించనున్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్. మేళాను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బి.పి.ఎస్.) -2019, లే అవుట్ రేగులరైజేషన్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్.)-2020 లో పెండింగ్ లో వున్న దరఖాస్తులను క్రమబద్దీకరణ చేసుకోవడానికి, టి.డి.ఆర్. లపై అవగాహన కల్పించనున్నామని తెలిపారు. మార్చి 13 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. సెలవు రోజుల్లో ఉండదని, ఎల్.టి.పిలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.
