
మార్చ్ 8న జరిగే జాతీయ లోకాదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులను కోరిన…………….. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత
వనపర్తి
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని, జిల్లా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయస్థానంలో సమావేశ మందిరంలో మార్చి 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ రజనీతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మార్చి 8వ తేదీన జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను, వివాదాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కోర్టులకు వెచ్చించే సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, కోర్ట్ ఫీజు కూడా వాపస్ పొందవచ్చు అని చెప్పారు. ఏదైనా కేసు ఒకసారి లోక్ అదాలత్ పరిష్కారం అయ్యింది అంటే అది శాశ్వతంగా పరిష్కారమైనట్లేనని చెప్పారు.
లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమవుతున్న కేసుల విషయంలో, రాష్ట్రంలో వనపర్తి జిల్లా స్థానం రాను రాను మెరుగుపడుతోందన్నారు. గత డిసెంబర్ 15 వ తేదీన నిర్వహించిన లోక్ అదాలత్ లో వనపర్తి జిల్లా కోర్టు అత్యధిక కేసులను పరిష్కారం చేసి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచిందని చెప్పారు. మార్చి 8వ తేదీన జరగబోయే లోక్ అదాలత్ లో మరిన్ని కేసుల పరిష్కారం ద్వారా వనపర్తి జిల్లా కోర్టు మరింత మెరుగైన స్థానాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
