TEJA NEWS

హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ పోటీలలో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థుల ప్రతిభ.

–స్మార్ట్ కిడ్జ్ విద్యార్థులకు రంగోత్సవ్ మెరిట్ మెడల్స్.

ఉమ్మడి ఖమ్మం

ముంబాయి కి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ 2024 సంస్థ వారు నిర్వహించిన రంగోత్సవ్ సెలబ్రేషన్స్లో హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ పోటీలలో స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులకు రంగోత్సవ్ మెరిట్ మెడల్స్ లభించాయి.
నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ పోటీలలో పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి మెడల్స్ గెలుచుకున్నారు. పాఠశాలకు చెందిన మచ్చ నిరూప తన అద్భుత ప్రతిభతో బొమ్మలు గీసి మెరిట్ ట్రోఫీ మెడల్ ను సొంతం చేసుకుంది. అలాగే పాఠశాలకు చెందిన బట్టు యశ్విని సాయి హ్యాండ్ రైటింగ్ పోటీలలో బి+ మెడల్ లభించింది. పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మెరిట్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు క్రీడా, సాంస్కృతిక, పలు రకాల నైపుణ్యాలను వెలికి తీసి నిత్యం ప్రోత్సహిస్తున్నామని కృష్ణ చైతన్య తెలియజేశారు. మెరిట్ అవార్డు పొందిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.


TEJA NEWS