
మహిళలు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి
ఇన్నర్వీల్ క్లబ్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరానికి విశేష స్పందన
చిలకలూరిపేట: భారతదేశంలో మధ్యవయసు స్త్రీలు చాలా ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్కు బలౌతున్నారని ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఒంకాలజిస్ట్ డాక్టర్ గీతా రుక్మిణి చెప్పారు. రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్, ఇన్నర్వీల్ క్లబ్ అఫ్ చిలకలూరిపేట సంయుక్థ ఆధ్వర్యంలో, ఒమేగా కాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కాన్సర్ నిర్దారణ పరీక్ష లు నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణ, పరిసరాల ప్రాంతాల నుంచి మహిళలు విశేషంగా తరలివచ్చారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలకు ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఒంకాలజిస్ట్ డాక్టర్ గీతా రుక్మిణి అవగాహన కల్పిస్తూ క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయన్నారు. . తొలినాళ్లలో గుర్తించలేకపోవడంతో ఏటా ఎంతోమంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లలో నాలుగోదన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి కారణంగా మహిళలలొ పెరుగుతున్న ,గర్భాశయ ముఖద్వారా కాన్సర్లు ,రొమ్ము కాన్సర్లు కేసులు పెరుగతున్నాయని మహిళలు వీటిగురించి సరైన అవగాహన కలిగి ఉండాలని అశ్రద్ధ చేయకుండ డాక్టర్ల దగ్గరకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు.
అనంతరం మహిళలకి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వెల్లటూరి రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 45 మంది మహిళలకి పాపస్మియేర్ టెస్టులు ,40 మంది మహిళలకి రొమ్ము కాన్సర్ కి మామోగ్రామ్ టెస్టులు ఒమేగా కాన్సర్ హాస్పిటల్ వారు నిర్వహించారు. ఇంకా 60 మంది మహిళలకి ఔట్ పేషెంట్ గా పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్టణంలో సీనియర్ గైనాకాలజిస్తులు డాక్టర్ కందిమల్ల జయమ్మ ,డాక్టర్ కొల్లా హేమంతి దేవి ,డాక్టర్ లావు అరుణ లు మహిళలకు వచ్చే పలు వ్యాధుల గురించి , తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి అవగాహన కల్పించారు. మహిళలకి సంబధించిన గర్భాశయ ముఖద్వారా కాన్సర్ లక్షణానాలు ,రొమ్ము కాన్సర్ లక్షణాలని ,వాటికి చేయించుకోవాలిసిన పరీక్షలు ,గురించి అక్కడికి వచ్చిన మహిళలకి వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వి పెద్దబ్బాయి, డాక్టర్ ప్రఫుల్లాదేవి, డాక్టర్ నాగ హర్షిత, డాక్టర్ రేష్మ, డాక్టర్ శ్వేత తో పాటు ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గట్టు సరోజిని, నార్నే జయలక్ష్మి, రామకృష్ణ మెమోరియల్ హాస్సిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
