TEJA NEWS

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్

ఘంటసాల :-
ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న.

తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

568 మార్కులతో కేతన జోత్స్న మండల ప్రథమ స్థానం రావడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

కేతన జోత్స్న తన సోదరుడు కూడా ఘంటసాలలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారి పట్ల చులకన భావాన్ని తొలగించేలా కేతన జ్యోత్స్న ఉత్తమ ఫలితాలు సాధించడంతో గ్రామంలోని పలు రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, తోటి విద్యార్థిని, విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


TEJA NEWS