TEJA NEWS

తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ తంగిరాల సౌమ్య ముందుకు సాగుతున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన నందిగామ పట్టణంలో 7 వార్డులలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మహిళలు హారతులు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు. తంగిరాల సౌమ్యతో పాటు ప్రచారంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.


TEJA NEWS