TEJA NEWS

విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .
ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం నుండి కల్తీ మద్యం అమ్మకాలను ప్రధాన ఆదాయంగా మార్చుకొని 5 సంవత్సరాల్లో 36వేల మంది పేద ప్రజల జీవితాలను నాశనం చేసి ఆడవాళ్ళ మాంగల్యలు తెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలుగు టిడిపి జనసేన బిజెపి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఎంవి శ్రీ భరత్ అన్నారు. ఈరోజు గాజువాక నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. తెలుగు మహిళా. వీర మహిళ. మహిళా మోర్చ్ ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరిగింది. ఈ సమావేశాల్లో పాల్గొంటూ.. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మరియు గంజాయి కి అడ్డాగా మార్చి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న పిల్లల్ని మత్తుకు బానిసగా చేస్తున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమే అన్నారు. దేశంలోనే మహిళలకు ఆర్థికంగా. సామాజికంగా. రాజకీయంగా. విద్యాపరంగా. మరియు ఉపాధి పరంగా అద్భుతమైన అవకాశాలు కల్పించిన చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారు దక్కుతుందన్నారు.. డ్వాక్రా మరియు డొక్కా సంఘాల ఏర్పాటు చేసి మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకు తీసుకొచ్చిన చరిత్ర శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి దక్కుతుందని అన్నారు . తెలుగ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడి కార్మికులు మరియు నిర్వాసితుల హక్కులు కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గ కుటమీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ. గాజువాక నియోజవర్గంలో ఏ వార్డుకు వెళ్లిన .ఏ గడప తొక్కిన ప్రజల స్వచ్ఛందంగా వచ్చి తమ ఆశీస్సులు అభిమానాన్ని అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా గల సభ గాని. తన నామినేషన్ కార్యక్రమానికి గాని రూపాయి ఆశించకుండా వేలాదిమంది ప్రజలు వచ్చి సంఘీభావం తెలపడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు.
వైకాపా ప్రభుత్వము. ఈత కాయంత ఇచ్చి తాటికాయ అంత
రాష్ట్ర ప్రజల నుంచి దోచుకు తింటుందని అన్నారు . నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోలు. డీజిల్. గ్యాస్. కరెంటు చార్జీలు. చెత్త పన్ను .ఇంటి పన్ను బస్సు చార్జీలు భారీగా పెంచి ఈ రాష్ట్ర ప్రజల్ని వంచనకు దగాకు గురిచేసిందని అన్నారు
జనసేన ఇన్చార్జ్ కోన తాతారావు మాట్లాడుతూ అనకాపల్లిలో దోచుకున్న అవినీతి సొమ్ముతో అమర్నాథ్ గాజువాకలో గెలవాలని చూస్తున్నాడని విజ్ఞులైన గాజువాక ప్రజలు. అవినీతిపరులకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బిజెపి ఇన్చార్జ్ కర్ణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్నారు.. ఈ కార్యక్రమానికి టిడిపి మహిళా అధ్యక్షురాలు ఎస్. అనంతలక్ష్మి. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ప్రమీల పట్నాయక్. కట్ట పద్మ .మాజీ కౌన్సిలర్ లంక లత. జనసేన నాయకులు m సాలిని. కరణం కళావతి. రోయ రత్నం. జ్యోతి రెడ్డి ఇందిరా ప్రియదర్శిని. టిడిపి మహిళా నాయకులు ఎర్ర మధులత. కాకి స్వరూప రాణి. స్వర్ణపుడి రాంబాయి. దీప్తి పట్నాయక్. సమ్మిడి ఉమా. కొత్తపల్లి ప్రభావతి. 1000 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .


TEJA NEWS