TEJA NEWS

టీడీపీ నేత బొలగాని సాంబశివరావు మృతి.

పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొలగాని సాంబశివరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు చండ్రగూడెం గ్రామంలో వారి నివాసానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాంబశివరావు గారి మృతి పట్ల తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS