పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదన్నారు.
తెలుగు దేశం హయాంలో పలు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయితే… మిగిలిన 10 శాతం కూడా పూర్తి చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపరించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం BJPతో కలిశామని చంద్రబాబు చెప్పారు.