
గుండెపోటు తో మృతి చెందిన టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ కెఎం జకీవుళ్లా కు నివాళులు అర్పించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
- అనంతపురం /పుట్టపర్తి
మాజీ రాజ్యసభ సభ్యుడు కె ఏం సైపుల్లా రెండవ కుమారుడు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కే ఏం జకీవుల్లా గుండెపోటు మృతి చెందడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు అనంతపురం రామ్ నగర్ లో ఉన్న కే. ఏం. సై పుల్లా నివాసంలో మృతుడు జాకివుల్లా భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జక్కి పుల్లా మృతిపై వారి కుటుంబ సభ్యులతో సమాచారం అడిగి తెలుసుకున్నారు.
జాకీముల్లా మృతి అత్యంత బాధాకరమని ఆయన లేని లోటు ఆ కుటుంబానికి ,మరియు తెలుగుదేశం పార్టీకి అనంతపురం నియోజవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. జకీవుళ్లా మృతి తో శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని అల్లా ను కోరుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, టీడీపీ నాయకులు రాయల్ మురళీ, కృష్ణమోహన్ , లక్ష్మీపతి ,పరమేశ్ , వెంకటప్ప , సింగవరం రవి , స్థానిక పుట్టపర్తి నియోజవర్గ నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి ,గంగాధర్ నాయుడు ,బీసీ గంగన్న, రామారావు , కౌన్సిలర్ లక్ష్మీపతి, స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
