TEJA NEWS

టీడీపీ సీనియర్ నేత విజయబాబు కి మాతృవియోగం.

ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం,

రెడ్డిగూడెం మండలం పాతనాగులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కలకొండ వీర వెంకట సత్యనారాయణ (విజయబాబు) కి మాతృవియోగం కలిగింది.గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కలకొండ నిర్మలాదేవి తుదిశ్వాస విడిచారు.

ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాతనాగులూరు గ్రామంలో వారి నివాసానికి విచ్చేసి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. విజయబాబు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS