హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం
నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను సమావేశానికి ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని భారాస నిర్ణయించింది…..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్
Related Posts
దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TEJA NEWS దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి, ఈ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన రాజగోపుర శిఖర కలశ స్తంభన పూజా మహోత్సవానికి ఎమ్మెల్యే…
భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత
TEJA NEWS భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జిల్లా కాటారం బస్ స్టాప్ వద్ద సమయానికి బస్సులు రాక ఎప్పుడు చూసినా నాలుగైదు బస్సులకు సరిపడా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కాటారం మండలంలో బస్టాండ్ లేక వృద్ధులు…