
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్:
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉప ముఖ్య మంత్రి భట్టివిక్రమార్క హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు ఆఫీసు నుంచి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.పరీక్షల ప్రక్రియ జనవరిలో ప్రారం భించామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు 3 నుంచి 22 వరకు జరిగాయని అన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయని గుర్తుచేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడు తూ.. ఫస్టియర్లో ఉత్తీర్ణత 66.89 శాతంగా, సెకండియర్ ఉత్తీర్ణత శాతం 71.37గా నమోదైందని చెప్పారు. ఫస్టియర్లో మొత్తం 4,88,413 మంది పరీక్షలు రాశారని, వారిలో బాలికల ఉత్తీర్ణత శాతం 73.83 శాతంగా, బాలుర ఉత్తీర్ణత శాతం 57.83 శాతంగా ఉందని తెలిపారు.
సెకండియర్లో 5,08,582 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, బాలిక ఉత్తీర్ణత శాతం 74.21గా, బాలుర ఉత్తీర్ణత శాతం 57.31గా ఉందని తెలిపారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను 10tv.inతో పాటు www.tgbie.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.
