TEJA NEWS

Telugu youth agitation in front of former minister Ambati Rambabu's house..

ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది.

ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతసేపు తెలుగుదేశం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇలా ఇరువురి మధ్య వాగ్వాదం తరువాత ఆందోళనకారులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవానికి ఆహ్వానించారు.


TEJA NEWS