TEJA NEWS

జమ్ము కాశ్మీర్ పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన సమావేశం ఉగ్రవాదుల దాడులను ఖండించింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.