TEJA NEWS

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయ్యే అన్ని అర్హలు ఉన్నాయని చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎంకు మస్క కొడుతున్నారని, మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ స్టేట్ మెంట్ ఇవ్వడంతోనే కౌంటర్ ఇచ్చానన్నారు. తాను ఇప్పుడు కూడా చెబుతున్నానని.. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కమిటెడ్ వర్కర్ అని అన్నారు.


TEJA NEWS