మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద నుంచి బేస్తవారిపేట పట్టణం సమీపం వరకు అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా పూసలపాడు వద్ద నెలన్నర వ్యవధిలో 6 మంది మృతి చెందారు.
అధికారులు రోడ్డు ప్రమాదాలపై ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు తగ్గకపోవడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అధికంగా రోడ్డు ప్రమాదంలో జరగడానికి గల కారణాలు వాహనదారులు మితిమీరిన వేగం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని నిర్లక్ష్యంతో వాహనాలు నడపవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.