ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం.
ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 స్కూళ్ల యందు విద్యార్థులు పలు సబ్జెక్టులోని మ్యాథ్స్ , సైన్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ మరియు పెయింటింగ్ సైబర్ నిర్వహించగా దాదాపు 7 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు . ఈ పోటీ పరీక్షలను ఐబిఓ వారు రెండు స్థాయిల యందు నిర్వహించారు . ప్రథమ స్థాయి పరీక్షలు వారి పాఠశాల యందు స్కూల్ ఉపాధ్యాయ సమక్షంలో జరిగినది . తద్వారా స్కూల్ టాపర్స్ మరియు క్లాస్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులు అందరిని రెండవ స్థాయి కాంపిటేటివ్ పరీక్షలకు ఎంపిక చేయడం జరిగింది . 2024 జనవరి నెల 28వ తారీఖున ఆదివారం రోజు అన్ని పాఠశాలలో నుండి దాదాపు 500 మంది విద్యార్థులు ఎంపిక కాగా ఎస్బిఐటి కాలేజీలో ఐబీఓ వారి సిబ్బంది ఆధ్వర్యంలో సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు . ఇతర జిల్లాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు . ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో నిలిచిన విద్యార్థులకు అవార్డు ప్రధాన ఉత్సవం నిర్వహించారు . జిల్లాల నుండి ఎంపికైన విద్యార్థులందరికీ ఐబీఓ సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్ రమేష్ బాబు మరియు మేనేజింగ్ పార్ట్నర్ ఎం వెంకట్ రెడ్డి మరియు జోయల్ డేనియల్ చేతుల మీదగా ఈ అవార్డులు అందించడం జరిగింది . అదేవిధంగా 2023 24 సంవత్సరంకుగాను ఉత్తమ సేవలను అందించిన పాఠశాల ప్రిన్సిపల్ లను కరస్పాండెంట్లను మరియు కోఆర్డినేటర్లను ఐబీఓ సంస్థ ప్రముఖుల ఆధ్వర్యంలో సన్మానించారు . ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అంతోటి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ఉన్న సృజనాత్మకతను ప్రతిభను విద్యార్థి దశలోని గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా వారు భవిష్యత్తుల్లో ఎదుర్కొనబోవు పోటీ పరీక్షలు యందు ఎంసెట్ , ఈసెట్ , జేఈఈ గవర్నమెంట్ జాబ్స్ మరియు ఇతర పోటీ పరీక్షల యందు సునాయాసంగా ఎదుర్కొని వారు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ ఒలంపియాడ్ పరీక్షలు దోహదపడుతుంది అన్నారు . ఈ సందర్భంగా ఇంత ఘనంగా ప్రోత్సహించి అన్ని జిల్లాల స్కూల్ల యాజమాన్యాలు తల్లిదండ్రులు ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపారు . అదే విధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా మరియు రాష్ట్రస్థాయి అవార్డులు పొందుకున్న విద్యార్థులు అందరికీ అభినందనలు తెలియపరిచారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథిగా విచ్చేసిన వారు ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన విద్యార్థులను ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హత పొందిన విద్యార్థులను ప్రోత్సహించుచు వారి సృజనాత్మకతను ఈ విధంగా ప్రపంచానికి సమాజానికి పరిచయం చేస్తున్న సంస్థ డైరెక్టర్ శ్రీ అంతోటి రామకృష్ణను అభినందించారు . ఈ కార్యక్రమంలో ఐబివో స్టేట్ ఇన్చార్జి కావ్య , డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ దివ్యస్వాతి , స్వీత, త్రిషా , కిరణ్ , సాత్విక్ , నాగేశ్వరావు , పవన్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు .