
సర్వాంగ సుందరంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన “16వ ప్రతిష్ట వార్షికోత్సవము” అత్యంత వైభవంగా నిర్వహించిన ఆలయ పాలకవర్గము, మరియు ఆర్యవైశ్య సంఘము, ఆధ్వర్యంలో పూజారి అవదానం నందకిషోర్ పర్యవేక్షణలో వేద పండితులతో ముందుగా గణపతి పూజ, స్వస్తి వాచనము,దేవతామూర్తులకు సపన్న కార్యక్రమం,మండపారాధన 108 కల శారాధన, సరస్వతీ దేవ మహోత్సవం,మహా పూర్ణ ఆహుతి కుంబాభిషేకం, అమ్మవారికి 108 కళాశాలతో జలాలతో అభిషేకం, మహనీవేదిన హారతి, సాయంకాలం అమ్మవారు బంగారు చీరలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనం, పల్లకి సేవ, ఉయ్యాల సేవ, హారతి, వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థప్రసాదాలు, హోమం ఉభయకర్తలు జొన్నలగడ్డ నాగేంద్ర, అఖిల, ఆ బంగారు చీరలు అమ్మవారిని చూడడానికి భక్తులకి రెండు కళ్ళు చాలలేదు అమ్మవారు దర్శనమిస్తుంటే ప్రతి ఒక్కరు ఆ వాసవి మాత ని చూచి పుణ్యహితులయ్యారు.అనంతరం ఆర్యవైశ్య మహిళలు కోలాటాల నడుమ 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేలాదిగా భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ సిహె.చ్. వెంకటేశ్వర్లు, సెక్రటరీ ఎస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా. రమేష్ బాబు, ఆలయ పాలకవర్గం మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు..
