
రాబోయేది బిజెపి ప్రభుత్వం-తల్లోజు ఆచారి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి,మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బిజెపి ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బిజెపి దేనని దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు కల్వకుర్తి రూరల్ క్రియాశీలక సభ్యుల సమావేశం మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది, కల్వకుర్తి మున్సిపాలిటీ క్రియాశీలక సభ్యుల సమావేశం మున్సిపాలిటీ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్ సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డి, సూర్య కృష్ణ గౌడ్, నరెడ్ల శేఖర్ రెడ్డి, పాలకూర రవి గౌడ్,నర్సిరెడ్డి, సురేందర్ గౌడ్, శ్యామ్, కృష్ణారెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్లు కృష్ణారెడ్డి, వివేకానంద, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండోజు గంగాధర్, అంజన్ రెడ్డి,మాయని రాజశేఖర్, నాయకులు వెంకటేష్ యాదవ్, నరేష్ గౌడ్, బాలరాజు గౌడ్, దేవర్ల అంజి, కుంభం రాజశేఖర్, నాప శివ, శివకుమార్,శేఖర్ రెడ్డి వాకిటి శ్రీకాంత్, శ్రీరామదాసు మహేష్,అరవింద్ రెడ్డి లక్ష్మీనరసింహ, సంతోష్ నాయక్, తాళ్ల మహేష్, జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు.
