
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు.
వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంఘం 38 వ వార్షికోత్సవ వేడుకలు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని వృద్ధుల, వికలాంగుల అన్ని వర్గాల సంక్షేమం కోసం సామాజిక భద్రత పెన్షన్లను అధిక మొత్తంలో పెంపుదల చేశారని తెలిపారు.
వారు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు దివ్యాంగుల పింఛన్ రూ 6 వేలకు పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ 15000 కిడ్నీ తల సేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ 10,000 పింఛన్ కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.
దివ్యాంగుల న్యాయపరమైన కోరికలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని ) ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దే రామ్మోహన్ రావు, బొండా ఉమా మహేశ్వరరావు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
వికలాంగులకు ప్రత్యేకంగా ఇళ్లను నిర్మించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 4% శాతం రిజర్వేషన్లను అందించాలని ఉచిత విద్యుత్తు, పన్నులను దివ్యాంగులకు మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
దివ్యాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయండి
వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ
మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద దివ్యాంగులకు ప్రత్యేకంగా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలన్నారు. .నిరుపేద దివ్యాంగులకు జీవనోపాధి కోసం రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో బడ్డీ కోట్లు ఏర్పాటు చేయాలన్నారు. అత్యాచారానికి గురైన దివ్యాంగ మహిళలకు రూ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. సకలాంగులతో సమానంగా వికలాంగులను చూడాలన్నారు.
వారు ఆత్మగౌరవంతో బతకడానికి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలోనే ఆసరా పెన్షన్లను ప్రారంభించారని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారని
గుర్తు చేశారు .
సామాజిక భద్రతా పెన్షన్లను, వికలాంగుల పెన్షన్లను పెద్ద మొత్తంలో అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
కార్యక్రమంలో వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, సెక్రటరీ నూర్ అహ్మద్, ఉమ్మడి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల దివ్యాంగులు పాల్గొన్నారు.
