TEJA NEWS

మల్కాజ్గిరి నియోజకవర్గం లోని 140 డివిజన్లో గల విష్ణు పూరి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగున్ని కాలనీవాసులు పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది….

నిర్మాణస్యంగా ఉన్న దేవాలయాలను ఎంచుకొని చోరీలు చేసే దుండగుడు.. ఆదివారం అర్ధరాత్రి మల్కాజ్గిరి లోని విష్ణుపురి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో సుమారు 12:30 ప్రాంతంలో దేవాలయంలోకి దూరి హుండీ పగలగొట్టి చోరీకి ప్రయత్నిస్తుండగా గమనించిన కాలనీవాసులు అప్రమత్తమై… సమాచారం అందుకున్న కమిటీ మెంబర్లు.. ప్రధానంగా శ్రీనివాస్ యాదవ్ చాకచక్యంగా గేటు మూయడానికి ప్రయత్నించగా దుండగుడు కత్తితో పొడవడానికి ప్రయత్నించి పారిపోతున్న సందర్భంలో వాసులందరూ వెంబడించి పట్టుకొని మల్కాజ్గిరి పోలీస్ లు… రాజేంద్రనగర్ సిసిఎఫ్ పోలీసులు నిఘా పాత నేరస్తుడిపై ఉండడంతో అదే సమయంలో అక్కడికి రావడంతో వారికి దుండగున్నీ దేహశుద్ధి చేసి అప్పగించారు…

పోలీసుల కథనం ప్రకారం అతడు పాత నేరస్తుడని సమాచారం మేరకే మేము అతడిని వెంబడిస్తున్నామని… ఇంతలోనే ఇక్కడ చిక్కడంతో అతన్ని పట్టుకోవడం జరిగింది.. కోర్టులో అప్పజెప్పి నిండుతుంది రిమాండ్ పంపుతామని చెప్పారు


TEJA NEWS