TEJA NEWS

జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురించేస్తున్న కమిషనర్ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న పరిశుద్ధ కార్మికులకు మద్దతుగా సంగీభావం తెలిపిన దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డిగారు బీజేపీ శ్రేణులు

డా ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ దుండిగల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గత మూడు నెలలుగా కమిషనర్ జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తీరను బీజేపీ తరపున ఖందించడం జరిగింది., స్థానిక మున్సిపల్ కమిషనర్ ఏమైనా ఇంటి నుండి ఇస్తున్నాడా ఏనెలకు ఆనెల వెంటనే ఈయొక్క కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు వారు సామాన్యు కింది స్థాయి చిరు ఉద్యోగులు కుటుంబం గడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కావున ఈ నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు గోనెమల్లారెడ్డి, నల్ల రామచంద్రారెడ్డి, సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు