కాంగ్రెస్ పార్టీకి వారంటీ, గ్యారంటీ అయిపొయింది..
మోదీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీకి లేదు..
కాంగ్రెస్ ఓడితే ఎన్నికలు ప్రజాస్వామ్యయుతం కాదా?
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్…
ధర్మపురి
పెగడపెల్లి : ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశంలో ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేసిన యాత్రతో ఎలాంటి ఫలితం వచ్చిందో తెలుసుకోవాలని ఎద్దేవాచేశారు.ఈసందర్బంగా మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితో మోడీ దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ హాయంలో ఎన్ని మత ఘర్షణలు జరిగాయో ఎన్డీఏ హాయంలో ఎన్ని మత ఘర్షణలు జరిగాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ప్రజాస్వామ్యయుతంగా జరుగలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని అవమాన పరిచారని కర్ణాటక,తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే మరి ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్టా అని తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు.
అంబానీ, అదానీల పెట్టుబడులతో మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని వారి పెట్టుబడులతోనే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచారన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దావోస్ లో అంబానీ, అదానీలను కలిశారని అప్పుడు వారి పెట్టుబడులతో గెలిస్తేనే దావోస్ వెల్లి కలిసి కృతజ్ఞతలు చెప్పారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అయిదు గ్యారంటీల పేరుతో తెలంగాణాలో ఆరు గ్యారంటీల మోసం చేసిందని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీల పేరుతో ముందుకెళ్తే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇస్తే ప్రజలు విశ్వశించరు అన్న వ్యాఖ్యలు జీవన్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. వందేళ్లు పైబడిన కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ, వారంటీ అయిపొయిందని రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని భావించిన మహారాష్ట్ర ప్రజలు దేశ హితం కోసం ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని తెలిపారు…ఈసమావేశంలో బీజేపీ నాయకులు పల్లె మోహన్ రెడ్డి, పెంట నరేందర్, వరద రాము, మంద భీమయ్య, కాశెట్టి రాజు, మూడపెల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు…