*అటవీ అధికారులకు జింక అప్పగింత:ఎస్సై కురుమయ్య
జింకను అటవీ సిబ్బందికి అప్పగిస్తున్న ఎస్సై
నర్వ:-నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని జక్కన పల్లి శివారు ప్రాంతం వ్యవసాయ పొలంలోకి వచ్చిన జింకపై ఉదయం కుక్కలు దాడి చేశాయి. ఆ కుక్కల నుండి జింకను గ్రామస్థులు రక్షించి స్థానిక ఎస్సై కురుమయ్యకు తన కార్యాలయంలో అప్పగించారు. ఎస్సై కురుమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జక్కన పల్లి గ్రామ శివారులోని పొలంలో మేత కోసం వచ్చిన జింకపై గ్రామ సింహాలు (కుక్కలు)వెంబడించాయి. అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి కుక్కల బారినుంచి జింకను కాపాడి ఎస్సై అందజేయడం జరిగింది. అటవీ అధికారికి అప్పగించారు.ఎస్ఐ సహాయంతో ఫారెస్ట్ అధికారి మరికల్ అందజేశారు. మా రాజ్యం కానీ అడవిలో వదిలేశారు. అక్కల బెడద జింకను కాపాడిన గ్రామస్తులను ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు.