
అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అనే కలను నిజం చేసిప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించి భారతావనికి దిక్సూచిలా దారి చూపిన గొప్ప రాజనీతిజ్ఞుడు మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ – MLA బొండా ఉమ
ఉదయం రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బీఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు, రాజీవ్ నగర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద, సింగ్ నగర్ లూనా సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, మరియు సింగ్ నగర్ అమెరికన్ హాస్పిటల్ వర్ధన ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పూలమాలవేసి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి కేక్ కట్ చేసి చదువుకునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఫ్రూట్స్, పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది…
ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది అని,భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘం, దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం…
అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంద అని, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని…
ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని, సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని,ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చి జోహార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అంటూ నినాదాలు చేశారు…
ఈ కార్యక్రమాలలో:- తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, SC సెల్ నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, మరియు వందలాదిమంది అభిమానులు పాల్గొన్నారు…
