TEJA NEWS

వార్డుల నూతన కమిటీ ఎన్నిక

చిలకలూరిపేట పట్టణం 29వ వార్డు అధ్యక్షులు గా షేక్ పట్నం కరిముల్లా, ప్రధాన కార్యదర్శి గా షేక్ కాలేషా నూతనంగా ఎన్నికైన సందర్భంగా, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు వారిని అభినందించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కరిముల్లా, నందం చంద్ర, తోట బ్రాహ్మస్వాములు, బ్యాంక్ బాజీ,కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.